Header Banner

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  Fri Jun 06, 2025 14:19        Business

కొన్ని నెలలుగా ఇన్వెస్టర్లు గోల్డ్‌ రేట్ల (Gold price)ను నిశితంగా గమనిస్తున్నారు. కొంత కాలం వేగంగా పెరిగిన ధరలకు బ్రేక్‌ పడింది. ఇప్పుడు ట్రెండ్‌ ఎటు వెళ్తుందోనని ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే రాబోయే నెలల్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం, మరో రెండు నెలల్లో బంగారం ధరలు డాలర్ పరంగా 12– 15% తగ్గవచ్చు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏకంగా గోల్డ్‌ 38% పతనం అవుతుందని అమెరికన్ రీసెర్చ్‌, అనలిస్ట్‌ కంపెనీ మార్నింగ్‌స్టార్‌కి చెందిన అనలిస్ట్‌ ఒకరు అంచనా వేస్తున్నారు. లాంగ్‌ టర్మ్‌లో బంగారం విలువ గురించి నిపుణులు పాజిటివ్‌గా ఉన్నారు. ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని గోల్డ్‌కి కేటాయించాలని సలహా ఇస్తున్నారు. 2025 జూన్ 3న భారతదేశంలో 10 గ్రాముల రిటైల్ బంగారం ధర రూ.96,960 వద్ద ఉంది. 3% గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌(GST)తో కలిపి ధర 10 గ్రాములకు రూ.99,868కి చేరుతుంది. అయితే పెరుగుతున్న ధరలు ఇండియాలో గోల్డ్ డిమాండ్‌ను దెబ్బతీశాయి. ఇండియా బులియన్ & జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారు ఆభరణాల అమ్మకాల్లో 30% తగ్గుదలని రిపోర్ట్‌ చేసింది. గత రెండు వారాల్లో యావరేజ్‌గా 1,600 కిలోలు తగ్గాయని, ధరలు దాదాపు 5% పెరిగాయని పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

మే 1510 గ్రాముల ధర రూ.92,365కి పడిపోయింది. మే ప్రారంభం, ముఖ్యంగా అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉందని IBJA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా ‘ఎకనామిక్‌ టైమ్స్‌’తో చెప్పారు. కానీ ధరలు మళ్లీ పెరగడంతో, కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారు అయిన భారతదేశంలో స్థిరమైన ధరలు డిమాండ్‌ను పెంచుతాయని వరల్డ్ గోల్డ్‌ కౌన్సిల్‌కి చెందిన కవితా చాకో అభిప్రాయపడ్డారు. ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరిగాయి. ఇలాంటి అస్థిర సమయాల్లో పెట్టుబడిదారులు తరచుగా బంగారాన్ని ‘సేఫ్‌ హెవెన్‌’గా భావిస్తారు. వాణిజ్య వివాదాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు గోల్డ్‌ ప్రైసెస్‌ ర్యాలీకి ఆజ్యం పోశాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఇటీవల ట్రంప్, చైనా టారిఫ్‌లు, వాణిజ్య అడ్డంకులను తగ్గించే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ తదుపరి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిన్న నెగిటివ్‌ కామెంట్‌ కూడా మార్కెట్లను ప్రభావితం చేయగలదు. ఈ టారిఫ్‌లు తగ్గించడానికి లేదా తొలగించడానికి యూరప్ ఒత్తిడి చేసినప్పటికీ, ఉక్కు, అల్యూమినియం టారిఫ్‌లను 50%కి రెట్టింపు చేయాలని అమెరికా యోచిస్తోంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఐదు వారాల గడువుకు ముందు చర్చలను వేగవంతం చేయడానికి 2025 జూన్ 4 నాటికి రివైజ్డ్‌ ట్రేడ్‌ ఆఫర్లు సమర్పించాలని అమెరికా ఇతర దేశాలను ఒత్తిడి చేస్తోంది. ఈ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని బలహీనపరచవచ్చు. మారుతున్న వాణిజ్య విధానాలకు మార్కెట్లు పతనం అవుతున్నాయి. దీంతో స్వల్పకాలంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai